చేసింది చెప్పుకుంటే.. జగన్‌కు తిరుగులేదా?

Chakravarthi Kalyan
ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. అయితే.. ఆ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయికి సరిగ్గా వెళ్లడం లేదన్న వాదన ఉంది. వాటిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ నేతలుతమ తమ అభిప్రాయాలను చెప్పడంతో పాటు పలు సూచనలు, సలహాలు అందించాలని కోరుతున్నారు.

 
పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించి జోనల్ స్థాయిలో సమావేశాలు నిర్వహించుకోవాలని.. వీలైనంత త్వరగా వైయ‌స్ఆర్‌ సిపి జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను పూర్తి చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని నేతలు భావిస్తున్నారు. జిల్లా, మండల, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఆయా కమిటీల్లో సభ్యులను భర్తీ చేసుకోవాలని.. ఆయా కమిటీల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింతగా వివరిస్తే గెలుపు మళ్లీ తమదేనని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: