త్వరలో ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డులు?

Chakravarthi Kalyan
ప్రతిష్టాత్మకంగా రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ నాల్గవ ఎడిషన్ అవార్డుల ప్రధానోత్సవాన్ని జూలై 2వ తేదీన నిర్వహించనున్నారు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల ఎంపిక అత్యంత పారదర్శకంగా చేయనున్నట్లు జ్యూరి సభ్యురాలు మిస్ ఇండియా, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి చెప్పారు. అవార్డుల ఎంపికలో ప్రతిభాపాటవాలే కొలమానాలుగా తీసుకుంటారని.. చదువుకోసం సంస్థ నిధులు ఖర్చు చేయడం సంతోషంగా ఉందని జ్యూరీ సభ్యురాలు నారాయణమ్మ విద్యాసంస్థల వైస్ చైర్మన్ శ్రీవిద్యారెడ్డి చెప్పారు.
రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో విద్య ద్వారా స్వాతంత్ర్యం అందించే అవకాశం లభించిందని.. 12 కేటగిరీల్లో అవార్డుల ప్రదానోత్సవం చేస్తారని... ఆర్ట్ అండ్ కల్చరల్, ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్ మెంట్, పుండ్ అండ్ బేవరేజ్, హెల్త్ కేర్, మౌలిక సదుపాయాలు, ఎన్.జీ.ఓ, రిటైల్, ఎస్.ఎం.ఈ, స్పోర్ట్స్, స్టార్ ఉమెన్, స్టార్టప్స్ ఇలా ప్రతి కేటగిరీలో ఇద్దరు విజేతలను ఎంపిక చేస్తారని నిర్వాహకులు తెలిపారు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల నామినీలను ఆన్ లైన్ లో www.prideoftelangana.comలో కానీ,  info@prideoftelangana.com మెయిల్ లో కానీ సమర్పించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: