అందుకే తెలంగాణ ప్రపంచ గుర్తింపు కోల్పోయిందా?

Chakravarthi Kalyan
తెలంగాణలో ఎక్కడ తవ్వకాలు జరిపినా బుద్ధ విగ్రహాలు బయటపడుతుంటాయని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. బౌద్ధ చరిత్ర తెలంగాణ ప్రాంతంతో ముడి పడి ఉందని చెప్పడానికి ఇది నిదర్శనమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. గత పాలకుల వల్ల బౌద్ధ విశిష్టత బయటికి రాలేదని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందువల్లే ఈ ప్రాంతానికి ప్రపంచంలో గుర్తింపునకు నోచుకోలేదని వాపోయారు.

ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఎన్నో చారిత్రక ప్రాంతాలను వెలుగులోకి తెస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధవనం నాగార్జునసాగర్ లో నిర్మిస్తున్న ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికి దక్కుతుందని శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. విదేశీ పర్యాటక సంఖ్య తెలంగాణకు క్రమంగా పెరుగుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భవిష్యత్తులో పర్యాటకాన్ని మరింత తీర్చిదిద్దుతామన్న శ్రీనివాస్ గౌడ్... బుద్ధ జయంతి సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: