మీ కాలేయం.. ఇలా కాపాడుకోండి!?

Chakravarthi Kalyan
లివర్‌ అనేది చాలా ముఖ్యమైన భాగం. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కాలేయ సమస్యల వలన అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ కాలేయ దినోత్సవం పురస్కారించుకొని  హైదరాబాద్ లక్డికపూల్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో రన్‌ నిర్వహించారు. ఇందులో లివర్‌ బాధితులు, ట్రాన్స్‌ప్లాంట్‌ చేసుకున్న వ్యక్తులు, వైద్యులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాలేయ ఆరోగ్యంపై అవగాహన పెరగాల్సి ఉందని గ్లోబల్‌ ఆసుపత్రి కాలేయ వ్యాధి నిపుణులు డాక్టర్‌ చందన్‌కుమార్‌ అన్నారు. ప్రతి ఒక్కరూ కాలేయ దానం చేయాలని లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్న ఓ విద్యార్థిని స్వతంత్ర అన్నారు. ఒకరు దానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేసిన వారమవుతుమని ఆమె అన్నారు. నాకు ఒకరు దానం చేయడం వలనే ఇవాళ ఇలా ఆనందంగా జీవిస్తున్నానని తెలిపారు. కీలకైమైన కాలేయంపై మీరు కూడా అవగాహన పెంచుకోండి. ఆరోగ్యం కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: