ఇక తిరుమల తరహాలో యాదాద్రి ప్రగతి?

Chakravarthi Kalyan
యాదాద్రి దేవాలయ అభివృద్ధి సంస్థను టీటీడీలా అభివృద్ధి చేయనున్నారు. వైటీడీఏ పరిధిని మరింతగా విస్తరించి, స్వీయ ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నిర్ణయించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి అథారిటీ, శిల్పారామాల అభివృద్ధిపై సీఎస్ బీఆర్కే భవన్ లో సీఎస్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. యాదాద్రి ఆలయ ఆడిట్ నివేదికలు, శిల్పారామాల అభివృద్ధిపై ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చర్చించారు. ప్రస్తుతం వైటీడీఏ పరిధిలో కేవలం ఏడు గ్రామాలే ఉన్నాయని... ఈ పరిధిని మరింతగా విస్తరించాలని సీఎస్ శాంతి కుమారి చెప్పారు.

విస్తరణ కోసం ప్రతిపాదనలు సమర్పించాలని  శాంతి కుమారి  తెలిపారు. దేవస్థాన పరిసర ప్రాంతాలు, గ్రామాలను అభివృద్ధి చేసి స్వీయ ఆదాయ వనరులు పెంచుకోవాలని సీఎస్‌ శాంతికుమారి సూచించారు. యాదాద్రి దేవస్థానం నిర్మాణం అద్భుతంగా ఉందని మున్ముందు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో మారుతుందని సీఎస్  శాంతి కుమారి ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: