అలాంటి అద్భుతాలు.. కేసీఆర్‌తోనే సాధ్యం?

frame అలాంటి అద్భుతాలు.. కేసీఆర్‌తోనే సాధ్యం?

Chakravarthi Kalyan
భాజపా నాయకులు మతం, కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపేట్టడమే కాకుండా... అభివృద్ధిని అడ్డుకుంటున్నారని... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు. దేశాన్ని అదానీ, అంబానీకి తాకట్టు పెట్టిన ప్రధాని మోదీ... అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని మంత్రి తలసాని మండిపడ్డారు. రాష్ట్రంలో, దేశంలో ఏదైనా సాహసం చేయాలన్న... పలు సంక్షేమ పథకాలు ప్రేవేశపెట్టి అమలు చేయాలన్న అది ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని మంత్రి తలసాని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకే... సాగర్ తీరాన 125 మహా విగ్రహాన్ని నిర్మించారని... దీనిని కూడా భాజపా, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయం చేయడం సిగ్గుచేటని మంత్రి తలసాని విమర్శించారు. వ్యాపార సముదాయంగా పేరు గాంచిన గోశామహల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని... కానీ ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్, భాజపా కార్పొరేటర్లు మతం పేరుతో రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి తలసాని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు:

Unable to Load More