హైదరాబాద్‌: అదిరే ఐడియా.. ఖాళీ స్థలాల్లో?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ నగరంలో ఎన్నో ఖాళీ స్థలాలు ఉంటాయి. చాలా మంది ముందు జాగ్రత్తగా భూములు కొనుక్కొని వాటి మెయింటైన్స్ వదిలేస్తారు. అలా నగరంలో ఉన్న ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ అర్బన్‌ ల్యాబ్ ఫౌండేషన్‌తో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. నగర నలుమూలల ఉన్న ఖాళీ స్థలాలు కేవలం డంపింగ్ యార్డుల్లా వదిలేయకుండా వాటిని సద్వినియోగం చేస్తారు. వాటిని పిల్లలు ఆడుకునే గ్రౌండ్లు, లైబ్రరీలు, సామూహిక సమావేశ స్థలాల్లానో ఉపయోగించుకోవచ్చనే ఉద్దేశంతో అర్బన్‌ ల్యాబ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

అర్బన్‌ ఆక్యుపంక్చర్‌ పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమంతో మహిళలు, చిన్నారుల భద్రత కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కేటిఆర్‌, జిహెచ్‌ఎంసి కమీషనర్‌ అరవింద్‌ కుమార్‌, జోనల్‌ కమీషనర్లతో సమావేశమైనట్లు అర్బన్‌ ల్యాబ్‌ సంస్థ తెలిపింది. ఈ ఐడియా బావుంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: