ఇక సినిమా రిలీజ్‌రోజే ఇంట్లో సినిమా చూడొచ్చు ?

Chakravarthi Kalyan
కొత్త సినిమా విడుదల రోజే ఇంట్లో కూర్చుని సినిమా చూస్తే ఎలా ఉంటుంది.. అందుకే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విడుదల రోజే చిత్రాన్ని ఇంట్లో కూర్చొని చూసే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఛైర్మన్ పి. గౌతంరెడ్డి తెలిపారు. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ, మీడియా సలహాదారు, నటుడు అలీ, నిర్మాతలు సి.కళ్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణతో కలిసి ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కొత్త సినిమాల విడుదలపై వివరాలను పి. గౌతంరెడ్డి వెల్లడించారు.

దీని ద్వారా చిన్న నిర్మాతలను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ఫైబర్ నెట్ ద్వారా కొత్త సినిమాలను ప్రసారం చేయనున్నట్లు పి. గౌతంరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో 55 వేల కిలోమీటర్ల కేబుల్ ఏర్పాటు చేశామని, 8 నుంచి 10 లక్షల మంది కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలు పొందుతున్నారని పి. గౌతంరెడ్డి తెలిపారు. వాటితోపాటు విడుదల రోజే కొత్త సినిమాను చూసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్లు గౌతంరెడ్డి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: