టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

Chakravarthi Kalyan
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీకేజీ అవ్వడంతో నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అంటున్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ అవ్వడం దుర్మార్గమైందని.. ప్రశ్నాపత్రం లీకేజీలో పెద్ధల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది కాబట్టి దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ర్ట ప్రభుత్వం తన అసమర్థతను ఒప్పుకోకుండా.. కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ర్టంలో కుటుంబ, అవినీతి, మాఫియా పాలన పోవాలని ప్రజలు కోరకుంటున్నారని.. తెలంగాణలో మార్పు తీసుకువచ్చే వరకు పోరాటం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.
టీఎస్పీఎస్సీ ముట్టడిలో అరెస్టయి.. జైలుకు వెళ్లిన భాజపా యువ మోర్ఛా రాష్ర్ట అధ్యక్షుడు భాను ప్రకాశ్‌తో పాటు నాయకులను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చంచల్‌గూడ జైల్‌కి వెళ్లి పరామర్శించారు. ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై పోరాడితే యువ మోర్ఛా నాయకులపై కేసులు పెట్టారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. పెట్రోల్‌ పోసి దగ్ధం చేసేందుకు వచ్చారని అక్రమ కేసులు పెట్టారని..తగలబెట్టడం తమ సంస్కృతి కాదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: