టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో పెద్ద తలకాయలదే పాత్ర?

Chakravarthi Kalyan
టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలో పెద్ద తలల్నికూడా సిట్‌ విచారణ చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు.  పేపర్‌ లీకేజిలో డబ్బులు చేతులు మారినందున అవినీతి నిరోధక చట్టంలో దీనికి వర్తించే సెక్షన్లు అన్నింటిని పొందుపరచాలని, కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ అధికారి శంకర్‌ లక్ష్మిని సాక్షిగా కాకుండా నిందితురాలిగా చేర్చాలని..  శంకర్‌ లక్ష్మి చేతిలో ఉండాల్సిన తాళాలు ఎవరి చేతిలోకి వెళ్లాయో...తేల్చాల్సి ఉందని రేవంత్‌ రెడ్డి  స్పష్టం చేశారు.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు పొందుపరచకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని రేవంత్‌ రెడ్డి  విమర్శించారు. ప్రభుత్వం నిందితులను కాపాడేందుకే ఈ ప్రయత్నం చేస్తోందని రేవంత్‌ రెడ్డి ద్వజమెత్తారు. అవినీతి నిరోధక శాఖ అధికారులను కూడా సిట్‌లో భాగస్వామ్యం చెయ్యాలని, నిబంధనలకు వ్యతిరేఖంగా లాలగూడలో సమయం దాటిన తరువాత గ్రూపు-1 పరీక్ష జరగడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: