
మంత్రి అంబటికి కనీస మానవత్వం లేదా?
ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన జనసేన.. గంగమ్మ, పర్లయ్యకు జనసేన నేతల రూ.4లక్షల ఆర్థిక సాయం అందించింది. సత్తెనపల్లిలో మంత్రి అంబటి బాధితులకు జనసేన సాయం అందించింది. మంగళగిరి జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ చెక్ అందజేశారు. ముఖ్యమంత్రికి మానవత్వం ఉంటే ఈ ఘటనపై స్పందించాలన్న నాదెండ్ల మనోహర్ ... ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5లక్షలు అందించాలన్నారు. ప్రభుత్వం అండగా లేకపోయినా మా పార్టీ నేతలు అండగా నిలిచారని.. వారందరినీ పార్టీ తరపున, పవన్ కళ్యాణ్ తరపున అభినందిస్తున్నానని నాదెండ్ల మనోహర్ అన్నారు.