జగన్ సంగతి సరే.. మరి లోకేశ్ పుట్టిందెక్కడ?
కేసులుపెడితే మీ తరపున తెదేపా పోరాటం చేస్తుందని.. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ప్రోత్సాహకాలు అందించారుని నారా లోకేశ్ గుర్తు చేసారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలు అభివృద్దిచేశాయని.. నేను విన్నా, నేను చూశా అంటూ వచ్చిన వ్యక్తిని నమ్మి మోసపోయారా అని నారా లోకేశ్ అన్నారు. పాదయాత్రలో దారిపొడవునా చెరకు, మామిడి రైతులు గగ్గోలు పెట్టారని.. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందుతున్నారని నారా లోకేశ్ అంటున్నారు. జగన్ హైదరాబాద్ పుడితే.. మరి నారా లోకేశ్ ఎక్కడ పుట్టి పెరిగారని జనం ప్రశ్నిస్తున్నారు.