ఆన్లైన్లోనే ఉప్పల్ వన్డే టికెట్లు.. పాస్ మస్ట్?
ఆఫ్లైన్ టికెట్లు అమ్మడంలేదని..ఆన్లైన్లో పెటిఎంలో మాత్రమే విక్రయిస్తామని అజారుద్దీన్ తెలిపారు. ఎల్బీ స్టేడియం, గచ్చీబౌలి స్టేడియంలలోఈ నెల 15నుంచి 18 వరకు ఉదయం పది నుంచి మూడు గంటల వరకు ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ సూచించారు. జనవరి 14న న్యూజిలాండ్ జట్టు నగరానికి వస్తుందన్న అజారుద్దీన్ పదహేనో తేదీన ప్రాక్టీసు చేస్తుందని పేర్కొన్నారు. భారత జట్టు 16వ తేదీన హైదరాబాద్ నగరానికి చేరుకుంటుందని హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు. పదిహేడో తేదీన ఇరు జట్లు ప్రాక్టీసు చేస్తాయని వివరించారు