డబ్బులు మోదీవి.. ఫోటోలు జగన్‌వి..?
దేశం కోసం అనేక మంది పోరాటం చేస్తే ఒక్క గాంధీ కుటుంబమే అంత చేసినట్టు చెప్పుకుంటున్నారని జీవిఎల్ నరసింహరావు తెలిపారు. పీవీ నరసింహారావు పేరు చెప్పడానికి కుడా గాంధీ కుటుంబం ఇష్టపడదని జీవిఎల్ నరసింహరావు అన్నారు. దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం వాజ్ పేయ్ మాత్రమేనని జీవిఎల్ నరసింహరావు అన్నారు. యూపిఏ ప్రభుత్వంలో అన్ని కుంభకోణాలు జరిగాయని అందుకే ఆ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు జీవిఎల్ నరసింహరావు.