ఎన్నికల ముందు మందుబాబులకు జగన్ షాక్‌ ఇస్తారా?

Chakravarthi Kalyan
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ సీఎం జగన్ మందుబాబులకు షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల లోపు ఏపీలో మద్య నిషేధం అమలు చేసే అవకాశాలు ఉన్నాయని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది. మద్య నిషేధం అనే అలోచన ప్రభుత్వంలో చర్చల దశలో ఉందని.. ఆ ఆనిర్ణయం తీసుకుంటే వంద షాపులు ఉన్నా, పది షాపులు ఉన్నా మూతపడక తప్పదని కోలగట్ల అన్నారు.


కరోనా వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్దితి అన్ని పరిగణనలోకి తీసుకుని దీనిని పరిశీలించాల్సి ఉంటుందన్న కోలగట్ల.. ఎన్నికల ముందు దీనిపై నిర్ణయం ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. దశల వారీగా మద్య నిషేధం విధిస్తానని ఎన్నికల ముందు జగన్ చెప్పారు. కానీ.. అమలులో అది సాధ్యం కావడం లేదు. మరి ఈ ఎన్నికల ముందు గతంలో ఎన్టీఆర్ తరహాలో మొత్తానికే మద్యం ఎత్తేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: