గుడ్‌న్యూస్.. జనవరి నుంచి వాళ్లకు రూ. 2750?
ఇప్పటి వరకూ రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెన్షన్ పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగుతుంది. జనవరి 1వ తేదీ నుంచి ఈ కొత్త పెన్షన్‌ను అమలు అవుతుంది. అలాగే వైయస్ఆర్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్ క్లాస్‌లు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్‌లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదన కు కూడా కేబినెట్ ఓకే చెప్పేసింది.