కోమటిరెడ్డికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్?
ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యహరించిన తీరు ఇందుకు కారణంగా తెలుస్తోంది. మునుగోడు సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడంపై అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్తు తెలుస్తోంది. అంతే కాదు.. ఆ సమయంలో ఆయనకు షోకాజు నోటీసు కూడా ఏఐసీసీ జారీ చేసింది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు కోమటిరెడ్డి అంటీముంటనట్లు వ్యహరిస్తూ వచ్చారు. ఆయన వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ కారణాలతోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించిన కమిటీల్లో ఆయన చోటు కల్పించలేదని తెలుస్తోంది.