పెళ్లాంపై అలిగాడు.. 42 ఏళ్లుగా అన్నం మానేశాడు?

frame పెళ్లాంపై అలిగాడు.. 42 ఏళ్లుగా అన్నం మానేశాడు?

Chakravarthi Kalyan
మొగుడూ పెళ్లాలు అన్నాక.. గొడవలు లేకుండా ఉంటాయా.. ఒకరిపై మరొకరు అలగడం.. ఆ తర్వాత కలసిపోవడం సంసారంలో సరిగమలే. కానీ.. ఓ మొగుడు మాత్రం పెళ్లాంపై చాలా సీరియస్‌గా అలిగాడు. ఎంతగా అంటే.. ఏకంగా పెళ్లాంపై అలిగి అన్నమే మానేశాడు.. అది కూడా దాదాపు 40 ఏళ్లకుపైగానే.. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. భార్య మీద అలిగి.. 42 ఏళ్లుగా అన్నం తినడం మానేసి కేవలం ఛాయ్ తాగుతూ బతుకుతున్నాడు. అప్పుడప్పుడు కాసిన్ని అటుకులు మాత్రం నములుతుంటాడు.


వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని  జైపుర్ జిల్లాలోని వికీపుర్ గ్రామానికి చెందిన రామచంద్రకు అతని భార్యతో 42 సంవత్సరాల క్రితం గొడవ జరిగింది. పనికి ఇంటికి వచ్చాక భార్యను అన్నం పెట్టమంటే.. ఆమె ఒంట్లో బాగా లేక.. అన్నం పెట్టలేకపోయింది. అంతే ఆకలితో వస్తే అన్నం పెట్టవా అంటూ భార్యపై అలిగాడు. అప్పటి నుంచి అన్నం మానేశాడు. ఇప్పుడు భార్యతో బాగానే ఉంటున్నా అన్నం మాత్రం ముట్టుకోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More