ఆ నగరంలో నో థూ థూ.. క్యాంపెయిన్.. భలే ఉందే?

Chakravarthi Kalyan
మన ఇండియన్లకు కాస్త కామన్‌ సెన్స్ తక్కువే అన్న వాదన ఉంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో జనం ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు. రోడ్డు పక్కన మూత్రం పోయడం.. ఉమ్మేయడం వంటి దుర్లక్షణాలు ఎక్కువ.. ఇప్పుడు కాస్త తగ్గాయనుకోండి. అయితే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో... బహిరంగ ప్రదేశాలు, రహదారులపై ఉమ్మివేయటాన్ని అరికట్టేందుకు కొత్త ప్రచారం ప్రారంభించారు.
రోడ్లపై ఉమ్మకుండా.. నో-తూతూ పేరిట ప్రత్యేక ప్రచారం చేపట్టింది. పాన్లు, గుట్కా వంటివి తిని ఉమ్మి వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ముందుగా ప్రజలకు ఈ ప్రచారం ద్వారా అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత  రెండో దశలో ఉమ్మివేసిన వారికి... జరిమానాలు విధిస్తారు. ఇండోర్  మేయర్  పుష్యమిత్ర భార్గవ మోవ్ -నాకా కూడలిలోని ఓ రోడ్డు డివైడర్ ను ఆయన శుభ్రం చేసి ఈ నో-తూతూ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. కేంద్రం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ఇండోర్‌ ఆరేళ్లుగా దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా నిలుస్తోంది. ఇండోర్‌ నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: