జగన్.. మడమ తిప్పేశావా..లోకేశ్‌ ఎద్దేవా?

Chakravarthi Kalyan
అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. టీడీపీ నేత నారా లోకేస్‌ సీఎం జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. రెగ్యులర్ చేస్తారని, సమాన పనికి సమాన వేతనం ఇస్తారని ఎదురుచూస్తున్న రెండున్నర లక్షలకు మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉపాధిపైనే జగన్ వేటు వేస్తున్నారని నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలోపు సర్వీసు వున్నవారందరినీ ఇంటికి సాగనంపుతున్న జగన్ ని జనం ఎందుకు నమ్మాలని నారా లోకేశ్‌ నిలదీశారు.
ప్రతీ ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని జగన్ గతంలో హామీ ఇచ్చారని నారా లోకేశ్‌  గుర్తు చేశారు. హామీలతో నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్  ఏళ్ళు గడుస్తున్నా ఒక్క జాబ్ క్యాలెండరూ  ఇవ్వలేదని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వారంలో రద్దు చేస్తానన్న సీపీఎస్ 150 వారాలైనా రద్దు చేయలేదని.. అలాగే అవుట్ సోర్సింగ్ వాళ్లకి ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ గాలికి ఎగిరిపోయిందని  నారా లోకేశ్‌ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: