చైనాలో తిరుగుబాటు.. మద్దతిస్తామంటున్న అమెరికా?

Chakravarthi Kalyan
చైనాలో పౌర నిరసనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. జీరో కొవిడ్ లక్ష్యం సాధించేందుకు చైనా నిర్బంధ చర్యలు పాటిస్తోంది. ఈ చర్యలపై జనం తిరగబడుతున్నారు. అయితే.. స్వేచ్ఛా వాయువుల కోసం పోరాడుతున్న చైనీయులకు ప్రపంచ పెద్దన్న, అగ్ర రాజ్యం అమెరికా మద్దతు చెబుతుండడటం విశేషం. చైనాలో ఏం జరుగుతుందో అధ్యక్షుడు జో బైడెన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. చైనాలో నెలకొన్నది మానవ హక్కుల సంక్షోభమని అమెరికా కామెంట్‌ చేస్తోంది. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలవాల్సి ఉందని అమెరికా చెబుతోంది.

చైనాలో పరిణామాలను అమెరికా నిశితంగా పరిశీస్తోంది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని చైనా స్పష్టంచేసింది. ప్రపంచ వ్యాప్తంగా శాంతియుత నిరసనలకు మద్దతిస్తూనే ఉంటామని అమెరికా అంటోంది. అలాగే చైనా అంశంలో తమ విధానం మారదని అమెరికా తేల్చి చెప్పింది. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని అమెరికా అంటోంది. పౌర ఆందోళనలను అణచివేయలాని చూడటం సమంజసం కాదని అమెరికా అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: