బాబుకు మోదీ ఆహ్వానం.. టీడీపీలో పరవశం?

Chakravarthi Kalyan
ప్రధాని నరేంద్ర మోదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీ అధ్యక్షుల సమావేశంలో పాల్గొనేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు  డిసెంబర్ 5వ తేదీన దిల్లీ వెళ్తున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది నవంబర్ 30 వరకూ జీ 20 దేశాల కూటమికి  భారతదేశం అధ్యక్షత వహిస్తోంది.

భారత్ లో నిర్వహించే జీ -20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో చర్చించాలని ప్రధాని నిర్ణయించారు. ఇందుకు  ప్రధాని, రాష్ట్రపతి భవన్ లో 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ  సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది. చంద్రబాబుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషీ ఆహ్వానం పంపారు. సమావేశ ప్రాధాన్యతను చంద్రబాబుకు వివరించి హాజరు కావాల్సిందిగా ఆయన ఫోన్ చేసి కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: