ఇంట్రస్టింగ్‌గా శివసేన గ్రూప్‌ ఫైట్‌.. బాణం గురి తప్పిందా?

Chakravarthi Kalyan
శివసేన పార్టీలోని గ్రూప్‌ ఫైట్‌ కొత్త మలుపు తిరుగుతోంది. పార్టీ గుర్తు అయిన విల్లు-బాణం గుర్తు కోసం చేస్తున్న పోరాటంలో ట్విస్ట్ వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాలకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ గుర్తును ఎవరికీ కేటాయించకుండా తాత్కాలికంగా నిలిపేసింది. దీంతో నవంబరులో తూర్పు అంధేరి నియోజవర్గానికి జరిగే ఉపఎన్నికలో ఈ వర్గాల్లో ఏ వర్గానికీ పార్టీ గుర్తు లభించదన్నమాట.


ఈ నియోజకవర్గంలో షిండే వర్గం మద్దతుతో బీజేపీఅభ్యర్థి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. అందుకే ఉద్ధవ్  ఠాక్రే వర్గం అభ్యర్థికి కొత్త పేరు, గుర్తుతో పోటీ చేసే అవకాశముంది. అందుకే గుర్తుపై.. త్వరగా నిర్ణయం తీసుకోవాలని, సీఎం ఏక్ నాథ్  షిండే గురువారం ఈసీకి లేఖ రాశారు. పార్టీ గుర్తు ‘విల్లు-బాణంను తమకు కేటాయించాలని కోరారు. ఈ విషయంపై ఇరువర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న ఎన్నికల సంఘం పార్టీ గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: