పులివెందుల హత్య.. చంద్రబాబు లేఖ..?

Chakravarthi Kalyan
పులివెందులలో గత నెల టీడీపీ కార్యకర్త పరమేశ్వర రెడ్డి హత్యకు గురయ్యారు. తండ్రి హత్య పై 8 మంది పై ఆయన కుమారుడు అనిల్ కుమార్ రెడ్డి ఆరోజే ఫిర్యాదు చేశారు. పల్లేటి హరినాథ రెడ్డి కుట్ర చేసి హత్యకు పాల్పడినట్లు అదే రోజు కొడుకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితుల్లో ముగ్గురిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. హత్యలో కుట్రదారుగా ఉన్న వ్యక్తి సహా ఇతర ఐదుగురు నిందితులు స్వేచ్చగా బయట తిరుగుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇప్పుడు ఇదే అంశంపై చంద్రబాబు ఏకంగా డీజీపీకి లేఖ రాశారు. హత్య కేసు నిందితులు అందరినీ అరెస్టు చేయ్యాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని  ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన ఈ 5గురి పేర్లను  ఎఫ్ఐఆర్ నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు లేఖలో తెలిపారు. హత్యకు కారణం అయిన వారందరినీ అరెస్టు చెయ్యాల్సి ఉన్నా పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబు  ఆగ్రహం వ్యక్తంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: