ఆంధ్రాలో అదరగొట్టిన అమెజాన్‌?

Chakravarthi Kalyan
ఇప్పుడు అంతా ఆన్‌లైనే.. ఏం కావాలన్నా ఆన్ లైనే.. అందుకే అమెజాన్ వంటి సంస్థల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఈ విషయాన్ని అమెజాన్ ఇండియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ అక్షయ్ అహుజా తెలిపారు. ఆన్లైన్ అమ్మకాల విషయంలో అమెజాన్ ప్రకటించిన 30 రోజుల గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో మొదటి 36 గంటల్లో సాధారణం కంటే 9 రెట్లు అధికంగా ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయం జరిగినట్లు తమ పరిశోధనలో వెల్లడైందని అక్షయ్ అహుజా వివరించారు.


ప్రత్యేకించి ఏపీలోనూ అమెజాన్ లో.. ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో ఈ పండుగ సీజన్లో అమ్మకాలు జరిగాయని అక్షయ్ అహుజా పేర్కొన్నారు. దాదాపు 2000 నూతన వస్తువులను, ఫైవ్ జి స్మార్ట్ ఫోన్లు, ఆధునిక బిజినెస్ మరియు గేమింగ్ ల్యాప్ టాప్లు, కెమెరాలు, టాబ్లెట్స్, బ్లూటూత్ స్పీకర్, స్మార్ట్ వాచ్ తదితర కంపెనీలకు సంబంధించిన కొత్త ఉత్పత్తులు ఈ పండుగ సీజన్లో ఆవిష్కరించామని అక్షయ్ అహుజా తెలిపారు. మొత్తం ఏడు మిలియన్ల ఉత్పత్తులను 11 లక్షల మంది అమ్మకం దారుల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచామని... ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా విశాఖపట్నంలో వినియోగదారుల నుంచి ఆదరణ అధికంగా లభించిందని అక్షయ్ అహుజా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: