టీడీపీ మహిళా నేతలపై అసభ్యకర పోస్టులు?

Chakravarthi Kalyan
సీఎం జగన్ ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపి అరాచక పాలన సాగిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఐటీడీపీలో చింతకాయల విజయ్ యాక్టివ్ గా ఉన్నందుకే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలు ఎత్తి చూపటం తమ బాధ్యత,  సమాధానం చెప్పలేక అరెస్టులు చేస్తారా అని టీడీపీ నేత కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలను అణగద్రొక్కుతున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ మహిళా నేతలు వంగలపూడి అనిత, గౌతు శిరీషలపై వైసీపీ పేటీఎం కుక్కలు అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆక్షేపించారు. వాటిపై ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ప్రజా స్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదని టీడీపీ నేత కొల్లు రవీంద్ర తేల్చి చెప్పారు. జగన్ రెడ్డి, పోలీసులకు చెబుతున్నాం,  తమరు చేస్తున్న పాపాలే మీకు శాపాలుగా మారుతాయని టీడీపీ నేత కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: