జగన్‌కు ఓట్లేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నారు?
ఎవ్వరూ ఫిర్యాదు చేయకుండానే ప్రకాష్ పై సుమోటోగా కేసు పెట్టిన పోలీసులు అదే జిల్లాలో ఎంపీ మాధవ్ వీడియో పై ఫిర్యాదు లేదని నక్కా ఆనందబాబు అన్నారు. గోరంట్ల మాధవ్‌కు మాత్రం రాచమర్యాదలు చేస్తారా అని ఆనందబాబు నిలదీశారు. న్యాయమైన బకాయిలు చెల్లించాలని చిన్న నిరసన తెలిపిన ప్రకాష్ పట్ల ప్రభుత్వ చర్యలు అమానవీయమని ఆనందబాబు మండిపడ్డారు. ఎన్నికల ముందు దళితుల పట్ల కపట ప్రేమ గుప్పించి ఇప్పుడు కక్ష సాధింపులకు దిగటం సిగ్గుచేటని నక్కా ఆనందబాబు విమర్శించారు.