ఆకలి రాజ్యం.. ఎంత దారుణ పరిస్థితులో..?

Chakravarthi Kalyan
అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా.. మానవుడి కనీస అవసరాలు తీర్చడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాం. ప్రపంచమంతా వినిపిస్తున్న ఆకలి కేకలే ఇందుకు ఉదాహరణ. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆకలి పరిస్థితులపై తాజాగా ఐక్యరాజ్య సమితి వెల్లడించిన నివేదిక వివరాలు చూస్తే గుండె చెరవు కాక మానదు.


మొత్తం 700 కోట్ల జనాభాలో దాదాపు 100 కోట్ల మందికి ఇంకా ఆకలి బాధతో ఇబ్బందులు పడుతున్నారట. ఇక చాలా మందికి ఆహారం దొరుకుతున్నా అది ఆరోగ్య కరమైన ఆహారం కాకపోవడం మరో విషాదం. ఇక మన దేశం విషయానికి వస్తే..  పౌష్టికాహారం కొనలేని స్థితిలోనే దేశంలో 70 శాతం మంది ఉన్నారని.. ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడించింది.


2030 నాటికి ఆకలి సమస్యను అధిగమించాలని గతంలో ఐక్య రాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుంది. కానీ.. ఆ లక్ష్యం నెరవేరే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. అంతే కాదు.. ఏటా ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరుగుతోందని ఐక్య రాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: