కేసీఆర్, కేటీఆర్‌లకు పవన్ ఆఫర్ ఇస్తున్నాడా?
విద్వేష రాజకీయాలను ప్రోత్సహించకూడదనే తాను మునుగోడు ఎన్నికల్లో పార్టీని బరిలో దింపడం లేదని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఇకపై తాను కేసీఆర్ తరహాలో వ్యూహం రచిస్తానంటూ పవన్ అన్నారు. అంతే కాదు.. ఇటీవల కేటీఆర్ కు కూడా స్నేహం చాటారు. మొత్తానికి తెరాస అంటే సానుకూలంగా ఉన్న పవన్.. తెలంగాణలో ఆ పార్టీతో జట్టుకడతారా అన్న చర్చ కూడా వినిపిస్తోంది.