గూగుల్ ప్లేస్టోర్: మనోళ్లు కుమ్మేస్తున్నారుగా?
లోకల్ డెవలపర్లు భారతీయ యాప్‌లు, గేమ్‌లతో గ్లోబల్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారట. దీంతో భారత్ వెలుపల ఉన్న వినియోగదారులు వెచ్చించే సమయం కూడా పెరిగిందట. ఇది 2019తో పోల్చితే 2021లో 150శాతం పెరిగిందట. ఇప్పటికే భారత్ వంద యూనికార్న్‌ల మైలురాయి దాటింది. వీటిలో ఎక్కువ శాతం యాప్‌లే కావడం విశేషం. స్టార్టప్ పరిశ్రమలు, డెవలపర్ల సహకారంతో భారత్‌లో గూగుల్ ప్లే స్టోర్ పదేళ్లు పూర్తి చేసుకుంది. గత రెండేళ్లలో విద్య, ఆరోగ్యం, వినోదం, గేమింగ్, చెల్లింపులు యాప్‌లు అద్భుతమైన వృద్ధి సాధించాయట.