జగనన్నా.. మమ్మల్ని కరుణించవా?

Chakravarthi Kalyan
కనీస వేతనాలను వర్తింప చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు . వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె నివాస్ తో ఎన్ హెచ్ ఎం సంఘాల నేతలు సమావేశమయ్యారు . తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని కోరారు . పర్సంటేజ్ ల ప్రకారం వేతనాలు పెంచితే ప్రతీ ఉద్యోగి 10 వేల నుంచి 15 వేల రూపాయలు నష్టపోతారని సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు .

గతంలో పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇచ్చారని నేతలు గుర్తు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులగా పనిచేస్తున్న వారందరికీ ఒకే తరహా వేతనం అమలుచేయాలని నేతలు కోరారు . సిబ్బంది సమస్యలు విన్న కమిషనర్ జె నివాస్ సమావేశాన్ని ఈనెల 18 కి వాయిదా వేశారు . సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: