పేదవాళ్లకు మోదీ మరో గుడ్ న్యూస్?
తాజాగా మరో రూ.85,406 కోట్లు విడుదల చేయబోతున్నారు. ఈ నిర్ణయంతో ప్రధాని నరేంద్రమోడీ గారు పేదల పక్షపాతిగా మరో సారి నిరూపించుకున్నారని బీజేపీ వర్గాలు ఘనంగా చెప్పుకుంటున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 21 లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం మోడీ ప్రభుత్వం రూ.32,000 కోట్లు మంజూరు చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. గుత్తేదారు జగన్ ప్రభుత్వం ఆ ఇళ్లకు “వైస్సార్ ఇళ్ళు” అని పేరైతే పెట్టింది కానీ నిర్మాణం పూర్తీ చేసి లబ్దిదారులకు ఇవ్వడం లేదని బీజేపీ నేతలు కొందరు విమర్శిస్తున్నారు.