ఆగస్టు 15న పుడితే.. ఆర్టీసీ బంపర్ ఆఫర్‌?

Chakravarthi Kalyan
దేశమంతటా ఆజాదీ అమృత మహోత్సవ్ వేడుకలు జరుగుతున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆ మూడ్ కనిపిస్తోంది. ఇప్పుడు ఆర్టీసీ కూడా ఈ మేరకు ఓ ప్రత్యేక ప్రకటన చేసింది. అజాదీ కా అమృతోత్సవ్‌ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ  వినూత్న కార్యక్రమాలు చేస్తోంది.  12 రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఉంటాయి.

అందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. ఆ పిల్లలకు 12 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అలాగే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులు కూడా ఈ నెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. ఈ ఆఫర్ భలే బావుంది కదూ. ఇటీవల బస్సులో పుట్టిన ఓ శిశువుకు జీవిత కాలం ఉచిత ప్రయాణం కూడా ఆర్టీసీ కల్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: