పేద కుటుంబానికి ఉచితంగా ఎకరా భూమి..?

Chakravarthi Kalyan

తెలంగాణలో ఎన్నిక సీజన్‌ దగ్గరకు వచ్చేస్తోంది. నేతల వాగ్దానాలు మొదలవుతున్నాయి. గతంలో కేసీఆర్‌ ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ.. ఆ హామీ అమలు చేయనే లేదు. దాన్ని కవర్ చేసేందుకు ఇప్పుడు దళిత బంధు అంటూ ఓ పథకం తీసుకొస్తున్నారు. అది కూడా నియోజకవర్గానికి కేవలం 100 మందికి మాత్రమే ఇవ్వబోతున్నారు.

ఈ పరిస్థితుల్లో మరో పార్టీ ఇప్పుడు ఉచితంగా భూమి ఇస్తామని వాగ్దానం చేస్తోంది. బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి ఎకరా భూమి ఇస్తామంటున్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌. కేసీఆర్‌ గతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన మాట నిలబెట్టుకోలేదని ఆయన గుర్తు చేశారు. అంతే కాదు.. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎసైన్డ్‌, పోడు భూములు ఎకరా నుంచి 5 ఎకరాల వరకు పట్టాలు ఇస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: