శ్రీలంక సీన్ రిపీట్‌.. ఆ రాష్ట్రాలకు మోదీ వార్నింగ్?

Chakravarthi Kalyan
శ్రీలంక పరిస్థితులపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దేశంలో పది రాష్ట్రాలు అప్పుల ఊబిలో ఉన్నాయని అఖిలపక్షానికి ఈ సమావేశానికి హాజరైన అధికారులు వివరించారు. శ్రీలంక తరహా పరిస్థితి ఈరోజు రాష్ట్రాల్లో తలేత్తే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర ఆర్ధిక శాఖ ఈ రాష్ట్రాల పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందన్న కేంద్రం.. తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అఖిలపక్షానికి తెలిపింది.

అయితే.. ఈ భేటీలో అనేక రాష్ట్రాల సమస్యలపై చర్చ జరిగింది. అయితే.. ఆయా రాష్ట్రాలు తమ పేరు తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్రం అప్పుల సంగతేంటని నిలదీశాయి. రాష్ట్రాల అప్పులపై మాత్రమే కాదు.. కేంద్రం అప్పులపైనా చర్చించాలని పట్టుబట్టాయి. మొత్తానికి ఈ వ్యవహారం.. నువ్వు శుంఠ అంటే నువ్వు శుంఠ అన్నట్టుగా తయారైంది. రాష్ట్రాలకు బుద్ది చెప్పాల్సిన కేంద్రం కూడా అప్పులు ఎక్కువ చేయడంతో కేంద్రాన్నే రాష్ట్రాలు ఎత్తి చూపుతున్న పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: