ఇల్లు కట్టుకునే వారికి భారీ షాక్.. భారీగా పెరిగిన సిమెంట్ ధరలు..!

Divya
పచ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచ మార్కెట్ ను కుదిపేస్తోంది. ఇప్పటికే ఎల్పిజి సిలిండర్, వాణిజ్య సిలిండర్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. అలాగే నూనె ధరలు, ఇతర ఆహార పదార్థాలు కూడా భారీగా పెరగడంతో సామాన్యులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు నిర్మాణరంగం పైన కూడా దీని ప్రభావం చాలా గట్టిగా పడినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా సిమెంటు ధరలు పెరుగుతాయనే చర్చ ఇప్పుడు మరొకసారి వైరల్ గా మారింది. సిమెంట్ కంపెనీలు సైతం తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తోంది.


నాన్ ట్రేడ్ కస్టమర్లకు సిమెంటు ధరలను ఏకంగా రూ.50 రూపాయల వరకు పెంచాయి.. దీంతో ప్రస్తుతం సిమెంట్ ధర రూ .280 నుంచి రూ .320 రూపాయల వరకు ఉన్నప్పటికీ ఆ తర్వాత రూ .370 వరకు పెరగనుంది. కొన్ని ప్రాంతాలలో రూ.420 రూపాయల వరకు కూడా పెరిగినట్లు వినిపిస్తోంది. సిమెంట్ కంపెనీల నిర్మాణంగంపైన ఈ భారం మరింత పెరిగిపోయిందని ఇంధన ధరల పెరుగుదల రవాణా ఖర్చులు పెరుగుదల  నేపథ్యంలో ఈ ధరలను పెంచినట్లుగా తెలుస్తోంది. పెంచిన సిమెంటు ధరలు నాలుగవ తేదీ అర్ధరాత్రి నుంచి 50 రూపాయల వరకు ఒక్కో బస్తా పైన అమలవుతుందని తెలుసి చాలామంది డీలర్లు పాత ధరకే స్టాకుని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇల్లు కట్టుకునే వారికి ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఇప్పటికే అధిక ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులు ఇప్పుడు మరింత భారం పడనుంది.


పచ్చిమసియాలో ఉద్రిక్తత పరిస్థితుల వల్ల విమాన రంగం పైన కూడా ఆ ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఉంది. విమాన ఫ్యూయల్, ధరలు కూడా అమాంతం పెరగడంతో దేశీ అంతర్జాతీయ విమాన టికెట్ ధరలు కూడా పెరగనున్నాయి. కిందన ధరలు భారం గా పెరగడంతో విమాన సంస్థలు ఆదరణకు ఖర్చులను ప్రయాణికుల పైన మళ్లించే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: