పల్నాడు జిల్లాలో
టీడీపీ నేత బాలకోటి రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గొడ్డళ్లతో ప్రత్యర్థులు దాడి చేశారు. ఆయన తీవ్ర గాయాలతో బయటపడ్డారు. చికిత్స పొందుతున్నారు. అయితే..ఇది
వైసీపీ వాళ్ల పనేనని చంద్రబాబు సైతం ఆరోపించారు. కానీ..
నరసరావుపేట గ్రామీణ
పోలీస్ స్టేషన్లో
మీడియా సమావేశం పెట్టిన డిఎస్పీ విజయభాస్కరరెడ్డి.. ఇది టీడీపీలోని మరో వర్గం పని అని తెలిపారు. రొంపిచర్ల మండలం అలవలలో
తెదేపా అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి పై దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్న డీఎస్పీ.. దాడికి పాల్పడింది పమ్మి వెంకటేశ్వరెడ్డి అనే
టీడీపీ నాయకుడు అని తెలిపారు. బాధితుడు కుమారుడు వెన్నా నర్సిరెడ్డి పిర్యాదు మేరకు 307 కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని.. దాడికి టీడీపీలో అంతర్గత మనస్పర్థలు కారణం అని డీఎస్పీ తెలిపారు. గత పంచాయితీ ఎన్నికల్లో
టీడీపీ నాయకులు వెన్నా బాలకోటిరెడ్డి, పమ్మి వెంకటేశ్వరరెడ్డి రెండు వర్గాలుగా ఉన్నారని.. బాలకోటిరెడ్డి రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేక వెంకటేశ్వరెడ్డి దాడికి పాల్పడ్డాడని డీఎస్పీ వివరించారు.