దేవాలయాలపై జగన్ సర్కార్ మాస్టర్ ప్లాన్?
రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన దేవాలయాలకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు వైసీపీ సర్కారు చెబుతోంది. ఏళ్ల తరబడి భక్తులకు సేవలు అందించేలా ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతోందని.. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అంటున్నారు. దేవాలయాల పేటెంట్ పోతోందని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. అందుకే ఎండోమెంట్ అడ్మినిస్త్రిటివ్ ఫండ్ గా, సీజీఫ్ కింద, అర్చక వెల్ఫేర్ ఫండ్ ద్వారా కొంత సొమ్ము ఇవ్వాలని 20 లక్షల ఆదాయం దాటిన దేవాలయాలను కోరుతున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
ధూప దీప నైవేద్యాల కోసం ఇవ్వాలని మాత్రమే ప్రభుత్వం కోరుతోందని.. దేవాలయాల అభివృద్ధి కోసమే మేం కోరుతున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అంటున్నారు. 2014 నుంచి పెండింగ్ లో ఉన్న స్టాట్యుటరీ నిధులు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం కోరిందని.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. హిందూ దేవాలయాలను దోపిడీ చేస్తున్నట్టు బిజేపి నేతలు ఎలా మాట్లాడతారని ప్రశ్నించిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. గతంలో బిజేపి ఎమ్మల్యే దేవాదాయశాఖ మంత్రిగా ఉండి 44 దేవాలయాలు కూలదోశారని గుర్తు చేశారు.