కుక్క రక్త దానం చేసింది.. ప్రాణం కాపాడింది?

Chakravarthi Kalyan
రక్త దానం.. ఈ పదం మనం సాధారణంగా మనుషులకే ఉపయోగిస్తాం. రక్త దానం చేసి దాన్ని నిల్వ చేసి అవసరమైన వారికి వినియోగిస్తాం. ప్రమాదాల్లో గాయపడి రక్తం కోల్పోయిన వారికి ఇది పునర్జన్మనిస్తుంది. అయితే.. ఈ రక్త దానం కుక్కల విషయంలో కూడా జరుగుతుంది. తాజాగా గుజరాత్‌లోని వడోదరాలో ఓ కుక్క రక్త దానం చేసి మరో కుక్కను కాపాడిన ఘటన ఆసక్తి రేపుతోంది.


ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ కుక్కకు రక్తం కావాల్సి వచ్చింది. మరో కుక్క నుంచి రక్తం తీసి.. ఆ కుక్కను కాపాడారు. వడోదరలో వాడి ప్రాంతానికి చెందిన శ్వేత దూబే వద్ద మొత్తం 23 కుక్కలు ఉన్నాయి. ఓ కుక్కకు అత్యవసరంగా రక్తం కావాల్సి వచ్చిందన్న సమాచారం తెసుకున్న శ్వేత.. వెంటనే తన కుక్కను తీసుకుని అక్కడికి వెళ్లింది. ఆ శునకం నుంచి రక్తం తీసుకుని గాయపడిన కుక్కలు ఎక్కంచి దాని ప్రాణాలు కాపాడారు. A

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: