రష్యాకు బిగ్ షాక్: ఉక్రెయిన్ కు బ్రిటన్ ట్రైయినింగ్?
హౌవిర్జర్ లైట్ గన్లు ఎలా వాడాలో ఉక్రెయిన్ దళాలకు బ్రిటన్ సైన్యం అవగాహన కల్పిస్తోంది. ఇంగ్లండ్ నుంచి ట్రైయినింగ్ పొందిన ఉక్రెయిన్ సేనలు తమ నైపుణ్యాల్ని మెరుగు పరుచుకుంటున్నాయి. రష్యాను మరింత దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నాయి. లాంగ్ రేంజ్ రాకెట్లను వినియోగించడంపై కూడా ఉక్రెయిన్ సేనలకు బ్రిటన్ సైన్యం శిక్షణ ఇస్తోంది. 50 మైళ్ల దూరంలోని శత్రు సేనల్ని మట్టుబెట్టే రాకెట్ లాంచర్లను కూడా బ్రిటన్ ఉక్రెయిన్ కు ఇస్తోంది.