షాకింగ్‌: గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కిన ఆ తెలుగు సినిమా?

Chakravarthi Kalyan
తెలుగు చిత్ర పరిశ్రమకు ఇది ఓ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఓ తెలుగు సినిమా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. యువ దర్శకుడు దీపక్ రెడ్డి దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్  మనసా నమః" గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 500కుపైగా అవార్డులు అందుకున్న ఈ చిత్రం...తమిళ, కన్నడ భాషల్లోనూ రీమేక్ అయ్యింది.

ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన ఈ చిత్రం..."ఆన్ లైన్ ఫిల్మ్ ఫెస్టివల్ టాప్ షార్ట్స్"లో ఉత్తమ రొమాన్స్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుంది. అలాగే హాలీవుడ్ కు చెందిన "ఇండిపెండెంట్ షార్ట్స్ అవార్డ్స్", "ఇండీ షార్ట్ ఫస్ట్ ఇండీస్", "మయామీ ఇండిపెండెంట్ ఫెస్టివల్" అవార్డులు గెలుచుకుంది. అలాగే డెట్రాయిట్ లోని "ట్రీనిటీ ఇంటర్నేషనల్ ", స్కాట్లాండ్ లో "ఫీల్ ది రీల్", అవార్డులు కూడా సొంతం చేసుకుంది. చివరకు ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ బరిలోనూ ఈ సినిమా నిలిచింది. ఈ షార్ట్ ఫిల్మ్ లో విరాజ్, దృశిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: