టెన్త్ విద్యార్థులకు బెటర్మెంట్ పరీక్షలు!

Purushottham Vinay
పదోతరగతి విద్యార్థులకు బెటర్‌ మెంట్‌ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇక ఈ మేరకు పరీక్షల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది.ఇక 49 అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి రెండు సబ్జెక్టుల్లో కూడా బెటర్‌మెంట్‌ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే సబ్జెక్టుకు రూ.500 ఫీజుతో పరీక్ష రాసేందుకు కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది.


ఇక ఈ ఏడాది పది పరీక్షలు రాసిన వారికి మాత్రమే బెటర్‌మెంట్‌ రాసే అవకాశం ఉందని విద్యాశాఖ కూడా స్పష్టం చేసింది.ఇక రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు కూడా టెన్త్ ఫెయిల్ అయ్యారు. దీనిపై విద్యార్థులలో ఆందోళన అనేది నెలకొంది. దీంతో టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయ్యాక వారిని కూడా రెగ్యులర్ గా పాస్ అయిన వారి జాబితాలో సమానంగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: