చంద్రబాబుకు ఎన్టీఆర్‌ తప్ప వేరే గతి లేదా?

Chakravarthi Kalyan
టీడీపీ వైఖరిని కాస్త గమనిస్తున్నారా.. కొన్నాళ్లుగా పార్టీ ఎన్టీఆర్‌ భజన బాగా కనిపిస్తోంది. అటు చంద్రబాబు మొదలుకుని నాయకుల వరకూ అంతా ఎన్టీఆర్‌ జపం చేస్తున్నారు. ఇటీవల జరిగిన మహానాడులోనూ ఎన్టీఆర్ స్మరణ బాగానే చేశారు. ఎప్పుడూ లేనివిధంగా చంద్రబాబు.. ఎన్టీఆర్‌ నామ స్మరణ ఇటీవల మరీ బాగా పెంచేశారు. గతంలో జై ఎన్టీఆర్‌ అనే మాట చంద్రబాబు నోటి నుంచి ఏనాడైనా వచ్చిందా అని వైసీపీ నాయకులు ఇప్పుడు ఎత్తి చూపుతున్నారు.


మహానాడు పెట్టినప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానం తప్ప ఎప్పుడైనా ఎన్టీఆర్‌ పేరు చంద్రబాబు ఉచ్ఛరించాడా..? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పేరు చెప్పుకుంటే ఓట్ల రాలవని, ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరని ఎప్పుడూ లేనిది కొత్తగా ఎన్టీఆర్‌ నామస్మరణ చేస్తున్నాడని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.  ఇటీవల పార్టీ కటౌట్లలోనూ ఎన్టీఆర్‌ బొమ్మ పెద్దగా కనిపిస్తోంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: