ఇవాళ ఐపీఎల్ వేలం.. ఎన్నివేల కోట్లో తెలుసా?
వేలంలో జీ, డిస్నీ స్టార్, వయాకామ్18, సోనీ సంస్థలు పోటీపడనున్నాయి.
2023 నుంచి 2027 వరకు ఐదేళ్ల కాలానికి మీడియా హక్కులను బీసీసీఐ వేలం వేస్తోంది. ఈ వేలంలో రూ.45 వేల కోట్ల ధర పలుకుతుందని బీసీసీఐ అంచనా వేస్తోంది. 2018-22 కాలానికి స్టార్ స్పోర్ట్స్ గతంలో రూ.16,347.50 కోట్ల ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు 2023-27 కాలానికి వేలంలో కనీస ధర రూ.32,440 కోట్లుగా నిర్ణయించారు. మరి ఈ టార్గెట్ వేలంలో బీసీసీఐ అనుకున్న లక్ష్యం రీచ్ అవుతుందా.. లేదా అన్నది చూడాలి.