హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ రేప్ కేసు విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అమ్మాయి మెడపై టాటూలా ఉంటుందనే కొరికామని రేప్ చేసిన మైనర్లు చెప్పడం వింతగా అనిపిస్తోంది. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలోకి కారును తీసుకెళ్లి నిర్జన ప్రాంతంలో నిలిపామని తెలిపిన మైనర్లు.. ఆ తర్వాత ఒకరి తరువాత ఒకరం అత్యాచారానికి పాల్పడ్డామని ఒప్పుకున్నారు. అమ్మాయి మెడపై టాటూల్లా ఉంటాయనే ఆలోచనతోనే పళ్లతో కొరికామని.. కానీ.. ఆమె ప్రతిఘటించడం వల్లే గాయాలయ్యాయని వారు పోలీసులుకు చెప్పినట్టు తెలుస్తోంది.
అత్యాచారం చేసినట్టు మైనర్లందరూ అంగీకరించినట్టు పోలీసు వర్గాల సమాచారం. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాదుద్దీన్ ప్రోద్బలంతోనే తాము అత్యాచారానికి పాల్పడినట్టు ఆ మైనర్లు చెప్పారట. అయితే ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాత్రం ఎమ్మెల్యే కుమారుడే మొదట బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పాడట. మొదటి రోజు గంట పాటు మైనర్లను విచారించిన పోలీసులు ఇవాళ మళ్లీ విచారించనున్నారు.