విశాఖలో టైటానిక్‌ తరహా ఓడ.. ఓ ట్రిప్‌ వేస్తారా?

Chakravarthi Kalyan
టైటానిక్ సినిమా చూసే ఉంటారు. అందులో ఓడ ఎంత బావుంటుందో కదా.. ఓడలోనే సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్లు, హోటళ్లు.. అబ్బో అదో మహా వైభోగం.. అలా సముద్రంలో తేలియాడుతూ ఆ సౌఖ్యాలు అనుభవించాలంటే.. మనకు అలాంటి అవకాశం ఎక్కడ ఉంది అని బాధపడనవసరం లేదు. ఇప్పుడు అలాంటి ఓ విలాసాల ఓడ సేవలు ఇక విశాఖపట్నం నుంచి కూడా  అందుబాటులోకి రాబోతున్నాయి. కార్డేలియా ఎమ్వీ ఎంప్రెస్‌ ఓడ ఇకపై చెన్నై-పుదుచ్చేరి, విశాఖపట్నం మధ్య తిరగబోతోంది.

విశాఖ-పుదుచ్చేరి-చెన్నై-విశాఖ మార్గంలో తొలి సముద్రయానానికి కార్డేలియా సంస్థ శ్రీకారం చుట్టింది. మూడు రాత్రులూ నాలుగు పగళ్లు ఈ పర్యాటక ప్యాకేజీ ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టికెట్లు అమ్ముడయ్యాయి. విశాఖ నుంచి పుదుచ్చేరికి ఈ ఓడలో 36 గంటల సమయం పడుతుంది. అక్కడి నుంచి చెన్నై వెళ్లి మళ్లీ విశాఖకి రావడానికి మరో రెండు రోజులు పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: