అయ్యో.. బాలికలు స్నానానికి నదిలో దిగితే..?

Chakravarthi Kalyan
అసలే మండే వేసవి.. ఈ సమయంలో చల్లటి నీరు, కాలువ, నది కనిపిస్తే ఎవరైనా ఆగుతారా.. అలా వేసవిలో నదిలో స్నానానికి దిగిన ఘటనలో ఘోర విషాదం చోటు చేసుకుంది. తమిళనాడులో నదిలో స్నానానికి వెళ్లి ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన తమిళనాడులోని కడలూరులో జరిగింది. తమిళనాడులోని  నెల్లికుప్పం అరుంగుణం సమీపంలోని కెడిలం నదిలోకి దగ్గర గ్రామాలకు చెందిన కొంతమంది యువతులు, బాలికలు స్నానానికి దిగారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువైంది. దీంతో ఓ యువతితో పాటు ఆరుగురు బాలికలు నీటిలో కొట్టుకుపోయారు.
ఆ బాలికలు, యువతి వేసిన కేసులు స్థానికులు విన్నారు. కొంతమంది నదిలోకి దిగి వారిని బయటకు తీశారు. వెంటనే వారిని కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘోరంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు .  ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: