జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకు?

Chakravarthi Kalyan
జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36 లోని ఓ పబ్లో గత నెల 28 న బాలికపై రేప్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికపై రేప్ జరిగినట్టు తేల్చిన పోలీసులు  ఇప్పటికే నలుగురు నిందితులను గుర్తించారు. వారు నలుగురు కారులోనే బాలికపై అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. వారిలో ప్రజాప్రతినిధుల కొడుకులు, ఓ ఎమ్మెల్యే కొడుకు, మరో మైనర్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారని అంటున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు.  

అయితే.. వారిని అధికార పార్టీ అండదండలతో వాళ్లను తప్పించే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. నిందుతులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నిన్న ఆ పార్టీ జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ దగ్గర మహాధర్నా నిర్వహిచింది. బీజేపీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర నిర్వహించిన ఈ ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: