పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులు సకాలంలో విడుదల కావడం లేదు. పోలవరం వాస్తవానికి జాతీయ ప్రాజెక్టు.. నిర్మాణ ఖర్చు అంతా కేంద్రమే భరించాలి.. కానీ.. చంద్రబాబు హయాంలో మేమే నిర్మించుకుంటాం.. మీరు ఆర్థిక సాయం చేయండని కోరడం కూడా ఇప్పుడు ఇబ్బందులకు కారణమైంది. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ఖర్చు చేసిన సొంత నిధులు వెయ్యి కోట్ల వరకూ ఉన్నాయి. వాటిని ఇంకా రీఎంబర్స్ చేయలేదు. అలాగే ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీని డీబీటీ పద్ధతిలో చేయాలని ఏపీ కోరుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా, సజావుగా సాగాలంటే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మొదటి స్పెల్‌లో నిధులు అడ్వాన్స్‌గా ఇవ్వాలి.. కానీ అలా జరగడం లేదు. వీటికి సంబంధించిన 80శాతం పనులు పూర్తైన తర్వాత రెండో స్పెల్‌లో మిగిలిన నిధులు ఇవ్వాలి. దీనికి తోడు కాఫర్ డ్యామ్ పాడవడం కూడా ఆలస్యానికి కారణం అవుతోంది. మరి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో?