ఇప్పటికీ పార్టీ నిర్మాణంలోనూ.. క్యా డర్ మెయింటైన్‌లోనూ టీడీపీ ట్రాక్ రికార్డు సూపర్‌గా ఉంటుంది. కార్యకర్తల కోసం అనేక పథకాలు నిర్వహిస్తున్న పార్టీ ఇది. ఇప్పుడు తాజాగా టీడీపీ కార్యకర్తల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ న్యూట్రిఫుల్ పేరుతో ఓ యాప్ తీసుకొచ్చింది.ఈ యాప్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఇక రాష్ట్రంలో వైకాపా పని అయిపోయిందనీ.. జరగబోయే ఎన్నికలు ఏకపక్షమే నని ధీమా వ్యక్తం చేశారు.
అసలు ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని చంద్రబాబు తెలిపారు. పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించిన చంద్రబాబు .. పార్టీలో గ్రూపులకు చెక్ పడాల్సిందేనని హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవన్నారు. కార్యకర్తల్లో కసి, పాలనపై ప్రజల అసంతృప్తే మహానాడు గ్రాండ్ సక్సెస్ కు కారణమని చంద్రబాబు అంటున్నారు.